హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 28వ ఐటీటీఎఫ్-ఏటీటీయు ఏషియన్ టేబుల్ టెన్నిస్ చాంపియషిప్నకు తెలంగాణ యువ ప్యాడ్లర్లు శ్రీజ, స్నేహిత్..భారత జట్టుకు ఎంపికయ్యారు. టోర్నీ కోసం జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(టీటీఎఫ్ఐ) గురువారం వేర్వేరు జట్లను ప్రకటించింది.
ప్రస్తుతం సోమ్నాథ్ ఘోష్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న శ్రీజ ప్రపంచ ర్యాంకింగ్స్లో 42వ స్థానంలో ఉండగా, స్నేహిత్ 106లో కొనసాగుతున్నాడు. తమ అకాడమీ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందని కోచ్ సోమ్నాథ్ పేర్కొన్నాడు. టోర్నీలో పతకాలు సాధించి దేశానికి మరింత ఖ్యాతిని తీసుకువస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
జట్టు వివరాలు: మానవ్ థక్కర్, మానుశ్ షా, స్నేహిత్, పయాస్ జైన్, అంకుర్ భట్టాచార్జీ, శ్రీజ, మనికా బాత్రా, యశస్విని, దివ్య, స్వస్థిక ఘోష్