IPL 2025 : భారీ ఛేదనను ధాటిగా మొదలు పెట్టిన ఆర్సీబీకి షాక్. డేంజరస్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (30) ఔటయ్యాడు. దంచికొడుతున్న అతడిని ఆకాశ్ సింగ్ వెనక్కి పంపాడు. ఆరో ఓవర్లో అతడు వేసిన స్లో బౌన్సర్‌ను ఆడబోయిన సాల్ట్.. దిగ్వేశ్ రథీకి సులువైన క్యాచ్ ఇచ్చాడు. దాంతో 61 వద్ద ఆ జట్టు మొదటి వికెట్ పడింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(33 నాటౌట్), కెప్టెన్ రజత్ పాటిదార్(1 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో ఆర్సీబీ 66 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 162 రన్స్ కావాలి.
లక్నో నిర్దేశించిన భారీ ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ(33), ఫిలిప్ సాల్ట్ (30)లు దంచేశారు. ఇద్దరూ పోటీపడి బౌండరీలు కొట్టారు. విలియం ఓ రూర్కీ ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు విరాట్. అతడి హిట్టింగ్‌కు లక్నో పేస్ 24 రన్స్ సమర్పించుకున్నాడు. దాంతో, తమ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ రథీకి బంతి అందించాడు పంత్. అతడికి బౌండరీతో స్వాగతం పలికాడు సాల్ట్.
Chase master is here 🏃♂️
Virat Kohli is up and running straightway 👌#RCB 66/1 after 6 overs.
Relive his spree of boundaries ▶️ https://t.co/Jw3gMXRYVo #TATAIPL | #LSGvRCB pic.twitter.com/SfJFcaIxhm
— IndianPremierLeague (@IPL) May 27, 2025
అనంతరం షాబాద్ ఓవర్లోనూ రెండు ఫోర్లు బాదాడీ చిచ్చరపిడుగు. దాంతో, 4 ఓవర్లకే స్కోర్ 50కి చేరింది. అవేశ్ ఖాన్ ఓవర్లోనూ కోహ్లీ, సాల్ట్ చెరొక ఫోర్‌తో 10 రన్స్ రాబట్టారు. ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు తరఫున 9 వేల పరుగులు మైలురాయికి చేరుకున్నాడు.