బెంగళూరు: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై, మధ్యప్రదేశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాపై ఘన విజయం సాధించింది. బరోడా మొదట నిర్ణీత 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. శివాలిక్శర్మ(36 నాటౌట్), శాశ్వత్ రావత్ (33) రాణించారు. సుయాంశ్(2/11) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ముంబై 17.2 ఓవర్లలో 164/4 స్కోరుతో లక్ష్యాన్ని అందుకుంది. రహానే(56 బంతుల్లో 98, 11ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ రహానే బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్, అతిత్, అభిమన్యు, శాశ్వత్ ఒక్కో వికెట్ తీశారు. మరో సెమీస్‌లో ఢిల్లీపై మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఎంపీ 15.4 ఓవర్లలో 152/3 స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(66 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. ఇషాంత్‌శర్మకు రెండు వికెట్లు దక్కాయి. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 146/5 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్(2/12) ఆకట్టుకున్నాడు.