హైదరాబాద్ : అంతర్జాతీయ క్రికెట్‌కు భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్ అజయ్‌రెడ్డి వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు అజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొనాడు. తన 15 ఏండ్ల కెరీర్లో భారత్ తరఫున 101 వన్డేలు, టీ20 మ్యాచ్‌లాడిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ టీ20 ప్రపంచకప్(2012), వన్డే వరల్డ్‌కప్(2014), ఆసియాకప్(2016), టీ20 ప్రపంచకప్(2017), వన్డే వరల్డ్‌కప్(2018), టీ20 ప్రపంచకప్(2022)లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ఈ సందర్భంగా అజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.