ఢిల్లీ: గతేడాది భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సేవలందించాడట. ఈ విషయాన్ని స్వయంగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) నసీబ్ ఖాన్ శుక్రవారం వెల్లడించాడు. జడేజా అందిస్తున్న సేవలకు డబ్బులు తీసుకోవాలని అతడిని పలుమార్లు కోరినా జడేజా మాత్రం.. ‘మీరు బాగా ఆడితే చాలు. అదే మీరు నాకిచ్చే రివార్డు’ అని చెప్పి తిరస్కరించాడట.