ఢిల్లీ : భారత్లో డోపింగ్ సమస్య అత్యంత తీవ్రంగా ఉందని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) హెచ్చరించింది. ఇప్పటివరకూ కేటగిరీ ‘బీ’లో ఉన్న భారత్.. కేటగిరీ ‘ఏ’లోకి మారిందని తెలిపింది. డోపింగ్ సమస్య తీవ్రంగా ఉన్న రష్యా, బెలారస్, ఇథియోపియా, కెన్యా, నైజీరియా, ఉక్రెయిన్ వంటి దేశాల జాబితాలో భారత్ చేరిందని ఏఐయూ పేర్కొంది.
కేటగిరీ ‘ఏ’కు మారడం అంటే భారత అథ్లెట్లకు కఠినమైన డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. డోపింగ్ నిబంధనల ఉల్లంఘనల విషయంలో భారత్.. 2022 నుంచి 2025 దాకా టాప్-2లో నిలిచింది. దేశంలో డోపింగ్ వ్యతిరేక సంస్కరణల కోసం అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) కృషి చేస్తున్నప్పటికీ అందులో తగినంత మార్పు కనిపించడంలేదని ఏఐయూ తెలిపింది.