పారిస్: ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డులను ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఆటగాడు, ఫ్రాన్స్‌కు చెందిన ఓస్మాన్ డెంబెలె దక్కించుకున్నాడు. గత సీజన్లో పీఎస్జీ చాంపియన్స్ లీగ్‌ను చేజిక్కించుకోవడంలో డెంబెలెది కీలకపాత్ర. ఈ అవార్డు కోసం స్పెయిన్ సంచలనం లమినె యమాల్‌తో పాటు అదే జట్టుకు చెందిన మిడ్‌ఫీల్డర్ రోడ్రి పోటీపడినా.. గత సీజన్లో 35 గోల్స్ సాధించిన డెంబెలెకే ఈ గౌరవం దక్కింది.
మహిళల విభాగంలో స్పెయిన్ స్టార్ ప్లేయర్ ఏతానా బొన్మతిని అవార్డు వరించింది. 27 ఏండ్ల ఈ స్పెయిన్ మిడ్ ఫీల్డర్.. నిరుటి సీజన్లో బార్సిలోనా తరఫున రాణించింది. మహిళల చాంపియన్స్ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచిన ఆమె వుమెన్స్ యూరో 2025 ఫైనల్లో స్పెయిన్ జట్టు.. ఇంగ్లండ్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.