టోక్యో: ఆ స్విమ్మర్ క్వాలిఫయర్స్‌లో కిందామీదా పడి చిట్టచివరి స్థానంతో ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. కానీ చివరికి అసలు రేసులో అతడే విజతగా నిలిచి గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు. టోక్యో ఒలింపిక్స్ 400 మీటర్ల ఫ్రీస్టైల్ మెన్స్ స్విమ్మింగ్‌లో ఈ అద్భుతం జరిగింది. ట్యునీషియాకు చెందిన 18 ఏళ్ల అహ్మద్ హఫ్నౌయి ఈ విజయంతో చాలా మందిని షాక్‌కు గురి చేశాడు. 400 మీటర్ల రేసును 3 నిమిషాల 43.36 సెకన్లలో పూర్తి చేసి ఆస్ట్రేలియా స్విమ్మర్ జాక్ మెక్‌లాలిన్‌ను వెనక్కి నెట్టాడు. ఈ విజయాన్ని తాను నమ్మలేకపోతున్నానని, కల నిజమైందని మెడల్ గెలిచిన తర్వాత అహ్మద్ అన్నాడు.
ఒలింపిక్స్ చరిత్రలో ట్యునీషియాకు ఇది ఐదో గోల్డ్ మెడల్ కాగా.. స్విమ్మింగ్‌లో మూడోది. ట్యునీషియా బాస్కెట్‌బాల్ ప్లేయర్ మహ్మద్ హఫ్నౌయి తనయుడైన అహ్మద్.. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నా 400 మీటర్లలో 8వ స్థానం, 800 మీటర్లలో ఏడో స్థానంలో నిలిచాడు. నిజానికి 2024 పారిస్ గేమ్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నా.. అనుకోకుండా అది టోక్యోలోనే దక్కింది.