IPL 2024 | సన్ రైజర్స్‌కు భారీ షాక్..! ఫస్ట్ షెడ్యూల్ మ్యాచ్‌లకు స్టార్ స్పిన్నర్ ఔట్..
IPL 2024 | ఈ సీజన్ తొలి షెడ్యూల్లో ఎస్ఆర్హెచ్.. నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకూ హసరంగ దూరం కానున్నాడు. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్.. అతడిని రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది.
IPL 2024 | ఐపీఎల్ – 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌కు భారీ షాక్. టీ20 స్పెషలిస్టు బౌలర్, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ ఈ సీజన్ తొలి షెడ్యూల్ (మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 దాకా) మిస్ అవనున్నాడు. ఈ షెడ్యూల్లో ఎస్ఆర్హెచ్.. నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నాలుగు మ్యాచ్‌లకూ హసరంగ దూరం కానున్నాడు. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన వేలంలో సన్ రైజర్స్.. అతడిని రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది.
ఎందుకు..?
హసరంగ ఫస్ట్ షెడ్యూల్‌కు దూరమవడానికి ప్రధాన కారణం అతడు జాతీయ జట్టు తరఫున ఆడుతుండటమే. పూర్తిగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే ప్రాధాన్యమిచ్చిన హసరంగ గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తాజాగా బంగ్లాదేశ్ టూర్లో ఉన్న అతడు.. టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. అదీగాక బంగ్లాదేశ్‌తో ఆడనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.
మార్చి 22 నుంచి సిల్హెట్ వేదికగా మొదటి టెస్టు ఆడనుండగా మార్చి 30 నుంచి రెండో టెస్టు జరుగనుంది. ఏప్రిల్ 03 దాకా రెండో టెస్టు జరుగనుంది. ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్.. మార్చి 23న తొలి మ్యాచ్ ఆడనుండగా 27, 30న తర్వాత మ్యాచ్‌లు ఆడుతుంది. ఫస్ట్ షెడ్యూల్లో భాగంగా ఆఖరి మ్యాచ్ ఏప్రిల్ 05న ఆడాల్సి ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు గనక త్వరగా ముగిసినా అతడు ఏప్రిల్ 05 న జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశముంటుంది.
Wanindu Hasaranga has now been named in Sri Lanka’s squad for the Test series against Bangladesh🇱🇰🏏
He is set to miss initial stages of IPL 2024❌ pic.twitter.com/spwKh9c7RW
— CricketGully (@thecricketgully) March 19, 2024
బంగ్లాదేశ్‌తో టెస్టులకు శ్రీలంక జట్టు : ధనంజయ డిసిల్వ, కుశాల్ మెండిస్, దిముత్ కరుణరత్నె, నిషాన్ మధుశంక, ఏంజెలొ మాథ్యూస్, దినేశ్ చండిమాల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లాహిరు ఉదర, వనిందు హసరంగ, ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెరిస్, కసున్ రజిత, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, చమీక గుణశేఖర
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

