IPL 2024 Auction: ఈ ఏడాది డిసెంబర్లో దుబాయ్ (?) వేదికగా జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం సందడి నెల రోజుల ముందుగానే షురూ అయింది. నవంబర్ 15వ తేదీలోపు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో రిటైన్, రిలీజ్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ ఇదివరకే ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్.. తన పేసర్, వెస్టిండీస్ బౌలర్ రొమారియా షెపర్డ్‌ను ముంబైకి ట్రేడ్ చేసింది.
2022లో ఐపీఎల్‌కు ఎంట్రీ ఇచ్చిన షెపర్డ్ తొలి సీజన్లో సన్ రౌజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఆ సీజన్లో హైదరాబాద్ షెపర్డ్ పై ఏకంగా రూ. 7.75 కోట్లు పెట్టి దక్కించుకుంది. కానీ ఆ సీజన్లో షెపర్డ్.. మూడు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు మాత్రమే తీశాడు. మూడు మ్యాచ్‌లలో 9 ఓవర్లు వేసి 98 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో 2023 వేలానికి ముందే సన్ రైజర్స్ అతడిని వదిలించుకుంది. 2023 వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని నామమాత్రపు ధర (రూ. 50 లక్షలు)కే దక్కించుకుంది.
𝗟𝗨𝗖𝗞𝗡𝗢𝗪 𝓼𝓮 𝗠𝗨𝗠𝗕𝗔𝗜 🤩
We have acquired the services of West Indian All Rounder ℝ𝕠𝕞𝕒𝕣𝕚𝕠 𝕊𝕙𝕖𝕡𝕙𝕖𝕣𝕕 following a successful trade with LSG.#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #IPL pic.twitter.com/6jEDhQt8lp
— Mumbai Indians (@mipaltan) November 3, 2023
తాజాగా ముంబై ఇదే ధరకు షెపర్డ్‌ను ట్రేడ్ చేసింది. ఈ విషయాన్నిముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో కూడా వెల్లడించింది. గత సీజన్లో ఉన్న కాస్త బౌలింగ్ వనరులతో అద్భుతంగా రాణించిన ముంబై ప్లేఆఫ్స్ చేరింది. గుజరాత్ చేతిలో ఓడిపోవడంతో ముంబై ఫైనల్ చేరడంలో విఫలమైంది. ఇదిలాఉండగా.. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ – 2024 వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.