Shreyas Iyer : ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టులో దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్.. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వాలంటే తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సిన స్థితిలో పడ్డాడు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. ఆ టోర్నీలో అద్భుతంగా రాణించిన అతడు దక్షిణాఫ్రికా సిరీస్‌లో మాత్రం ఆ మార్కును చూపలేకపోయాడు. రెండు టెస్టులలో నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిసి 41 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అయ్యర్ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు.
విమర్శల నేపథ్యంలో 29 ఏండ్ల అయ్యర్.. ముంబై తరఫున రంజీలలో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే మొదలైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో భాగంగా ముంబై జట్టు.. జనవరి 12 నుంచి 15 దాకా ముంబై వేదికగా ఆంధ్రాతో మ్యాచ్ ఆడాల్సి ఉండగా అయ్యర్ ఈ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మేరకు ముంబై రంజీ టీమ్.. జట్టును ప్రకటించింది. అజింక్యా రహానే సారథ్యంలో అయ్యర్ రంజీ మ్యాచ్ ఆడి ఫామ్ చాటాలని భావిస్తున్నాడు. రంజీ మ్యాచ్‌లలో రాణిస్తే అయ్యర్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. ఇదిలాఉండగా సౌరాష్ట్ర తరఫున ఇటీవలే జార్ఖండ్‌తో మ్యాచ్ ఆడిన పుజారా డబుల్ సెంచరీతో చెలరేగి టెస్టులలో రీఎంట్రీ కోసం తహతహలాడుతున్న విషయం తెలిసిందే.
🚨📰| Shreyas Iyer is set to play for Mumbai in their next Ranji Trophy match against Andhra from January 12.
(TOI) pic.twitter.com/5bEdiCSf3b
— KnightRidersXtra (@KRxtra) January 9, 2024
ఆంధ్రాతో మ్యాచ్‌కు ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, జయ బిస్తా, భూపెన్ లల్వాని, అమోఘ్ బక్తల్, సువేద్ పర్కర్, ప్రసాద్ పవార్, హార్ధిక్ తామోర్, షమ్స్ ములాని, తనూశ్ కోటియన్, అథర్వ అంకోలేకర్, మోహిత్ అవస్తి, దవల్ కులకర్ణి, రాయ్స్తన్ దియాస్, సిల్వస్టర్ డిసౌజా