Australia Open 2024: నొవాక్ జొకోవిచ్.. స్టీవ్ స్మిత్.. టెన్నిస్, క్రికెట్ గురించి తెలిసినవారికి ఈ రెండు పేర్లు సుపరిచితమే. టెన్నిస్‌లో వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్‌గా ఉన్న జొకోవిచ్.. ఆధునిక క్రికెటర్లలో బ్యాటింగ్ దిగ్గజంగా ప్రశంసలు అందుకుంటున్న స్టీవ్ స్మిత్‌లు ఒకే వేదిక పంచుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి తమ రోల్స్‌ను మార్చుకున్నారు. స్మిత్ టెన్నిస్ రాకెట్ పట్టగా.. జొకోవిచ్ బ్యాట్ పట్టి తన క్రికెటింగ్ స్కిల్స్ చూపించాడు. త్వరలో గ్రాండ్‌గా మొదలుకాబోతున్న ఆస్ట్రేలియా ఓపెన్ ఇందుకు వేదికైంది.
ప్రతి యేటా ఆరంభంలో జరిగే తొలి గ్రాండ్ స్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్ ఆరంభానికి మూడు రోజుల ముందు జరిగిన ఎగ్జ్బిషన్ మ్యాచ్‌లో జొకోవిచ్, స్టీవ్ స్మిత్‌తో పాటు పలువురు స్టార్ టెన్నిస్ క్రీడాకారులు, అమెరికాకు చెందిన ప్రముఖ బాస్కెట్‌బాల్ ప్లేయర్ అలన్ విలియమ్స్ కూడా అభిమానులను అలరించారు. మెల్బోర్న్లోని రాడ్ లీవర్ ఎరీనాలో రాత్రి.. స్మిత్ రాకెట్ పట్టి జొకోతో టెన్నిస్ ఆడాడు. జొకో కూడా క్రికెట్ ఆడాడు. అయితే టెన్నిస్ రాకెట్‌ను ఆడటంతో మొనగాడు అయిన జొకో.. బ్యాట్ పట్టుకోవడానికి ఇబ్బందిపడ్డా, తర్వాత అదే రాకెట్‌తో బంతిని బలంగా బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆస్ట్రేలియా ఓపెన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా వేదికగా విడుదల చేసింది.
Game respects game!
(And Novak is just like the rest of us when it comes to Smudge…)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
జనవరి 14 నుంచి మొదలుకాబోయే ఆస్ట్రేలియా ఓపెన్‌లో జొకోవిచ్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో పది ట్రోపీలు నెగ్గిన జొకో.. కెరీర్ మొత్తంలో 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచి ఈ ఏడాది పైతం ట్రోఫీ నెగ్గి దానిని 25కు పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈసారి అతడికి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సవాల్ కూడా లేకపోవడం జొకో విజయావకాశాలను మరింత మెరుగుపరిచేదే.. ఇక స్టీవ్ స్మిత్ విషయానికొస్తే.. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ అవడంతో త్వరలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతడు ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు.
Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out…@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Race again in Paris? 😅@DjokerNole v @pbol800
#AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE
— #AusOpen (@AustralianOpen) January 11, 2024
Nothing. But. Net.
Like it wouldn’t have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB
— #AusOpen (@AustralianOpen) January 11, 2024