IND vs ENG 5th Test | దలైలామాను కలిసిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్
IND vs ENG 5th Test | ఐదో టెస్టుకు ముందు పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో ఇంగ్లండ్ క్రికెటర్లు ఆయన దగ్గరకి వెళ్లి కాసేపు ముచ్చటించారు.
IND vs ENG 5th Test | ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్) వేదికగా గురువారం (మార్చి 8) నుంచి భారత్‌తో జరగాల్సి ఉన్న ఐదో టెస్టుకు ముందు పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో ఇంగ్లండ్ క్రికెటర్లు ఆయన దగ్గరకి వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ట్విటర్ (ఎక్స్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రాంచీ టెస్టు తర్వాత కాస్త విరామం దొరకడంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్న ప్రకృతి పరిసరాలను చుట్టి వస్తున్న ఇంగ్లీష్ క్రికెటర్లు తాజాగా దలైలామాను కలిశారు.
దలైలామాను కలిసినవారిలో ఇంగ్లండ్ క్రికెటర్లు జాక్ క్రాలే, టామ్ హర్ట్లీ, డాన్ లారెన్స్, ఒలీ పోప్, గస్ అట్కిన్సన్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఉన్నారు. ఇంగ్లండ్ క్రికెటర్లు దలైలామాతో కరచాలనం చేస్తూ భుజాన తెల్ల కండువాలు వేసుకున్న ఫోటోలను ఈసీబీ షేర్ చేసింది. కాగా, దలైలామాతో విదేశీ క్రికెటర్లు భేటీ అవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఆయన నివాసానికి వెళ్లి కొంతసేపు అక్కడ గడిపి వచ్చింది.
An incredible honour to meet his holiness, the @DalaiLama 🙏
England players and management attended his residence in McLeod Ganj, Dharamshala. pic.twitter.com/lW95xKbH7s
— England Cricket (@englandcricket) March 6, 2024
ఇక భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లండ్.. ధర్మశాల టెస్టులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. నేడు ఇంగ్లండ్ తుది జట్టును కూడా ప్రకటించింది. రాంచీ టెస్టులో ఆడిన పేసర్ ఓలీ రాబిన్సన్ను తప్పించి మరో పేసర్ మార్క్‌వుడ్‌ను జట్టులో చేర్చింది.
ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హర్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

