Rohit Sharma: భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఫిట్‌నెస్‌పై ఒకప్పుడు జోరుగా చర్చించుకునేవారు. మాజీ క్రికెటర్ల నుంచి కామెంటేటర్ల వరకూ అందరూ హిట్‌మ్యాన్‌ను టార్గెట్ చేసేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. రోహిత్ చాలా చిక్కిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బాగా లావెక్కి పెద్ద పొట్టతో కనిపించిన రోహిత్.. ఇటీవల ‘సియట్ టైర్స్’ అవార్డుల కార్యక్రమంలో స్లిమ్‌గా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఏంటీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని అభిమానులు సైతం నోరెళ్లబెట్టారునుకో. మరి.. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసా..?
టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్లాడు. తిరిగొచ్చాక అతడు తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. మళ్లీ వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కాలంటే ఫిట్‌గా మారడం అనివార్యం కావడం.. ఎలాగైనా సన్నబడాలనుకున్నాడు. అందుకు మాజీ కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) సాయం తీసుకున్నాడు. ముంబైలో నాయర్ సూచలను పాటిస్తూ కఠినమైన దినచర్య పాటించాడు రోహిత్. తనకెంతో ఇష్టమైన ఆహారానికి సైతం దూరంగా ఉంటూ శ్రమించాడని మాజీ సారథి ఫిట్నెస్ వివరాలు పంచుకున్నాడు నాయర్.
10 kilos down, 800 reps strong! 💪#AbhishekNayar breaks down @ImRo45‘s fitness journey – the hard work, the discipline, and the transformation behind the Hitman’s return. 🔥#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/UKfDWdFUBN
— Star Sports (@StarSportsIndia) October 19, 2025
‘బరువు తగ్గడానికి రోహిత్ చాలా కష్టపడ్డాడు. రోజుకు మూడు గంటలు జిమ్‌లో చెమటోడ్చాడు. ఎక్కువగా కార్డియో వ్యాయామాలు చేసేవాడు. మొదటి ఐదు వారాలు అయితే.. బాడీ బిల్డింగ్ కోసం అన్నట్టుగా శ్రమించాడు. పూర్తిగా సన్నబడాలనుకున్న అతడు ఒకే వ్యాయామాన్ని 700 నుంచి 800 సార్లు చేసేవాడు. అందుకు రోజు గంట, గంటన్నర సెషన్ పట్టేది. ట్రై సెప్స్ కూడా ఎక్కువ చేసేవాడు. క్రాస్ ఫిట్ కోసం 15-20 నిమిషాలు కేటాయించేవాళ్లం. అంతేకాదు ఆహారం విషయంలోనూ క్రమశిక్షణ పాటించాడు. తనకెంతో ఇష్టమైన వడాపావ్.. వంటి చిరుతిళ్లకు దూరమయ్యాడు.
Rohit Sharma stealing the spotlight at the CEAT Awards — fit, fresh, and full of style! 😎🇮🇳✨#CeatAwards #RohitSharma #India #Sportskeeda pic.twitter.com/CXaNlSoEZd
— Sportskeeda (@Sportskeeda) October 7, 2025
ఇలా వారంలో ఆరు రోజులు.. రోజుకు మూడు గంటలు.. ఇలా మూడు నెలలు బ్రేక్ లేకుండా కష్టించాడు కాబట్టే.. రోహిత్ 11 కిలోలు తగ్గి స్లిమ్‌గా తయారయ్యాడు’ అని రోహిత్ ఫిట్నెస్ రహస్యం వెల్లడించాడు అభిషేక్ నాయర్. వన్డే స్క్వాడ్‌లో చోటు కోసం తీవ్రంగా శ్రమించి సన్నబడిన రోహిత్.. ఆస్ట్రేలియపై తొలి వన్డేలో ఉసూరుమనిపించాడు. 8 పరుగులకే హేజిల్‌వుడ్ ఓవర్లో ఔటయ్యి అభిమానులను నిరాశపరిచాడు.