Rohit Sharma | కోహ్లీ బాటలో రోహిత్.. టీ20లకు వీడ్కోలు చెప్పిన హిట్‌మ్యాన్
Rohit Sharma | టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బాటలోని నడిచాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.
Rohit Sharma | టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బాటలోని నడిచాడు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీని ఎలాగైనా గెలవాలనుకున్నా. అనుకున్నది సాధించా. టీ20 కెరీర్‌లోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశా’ అని హిట్‌మ్యాన్ అన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్.. 159 మ్యాచ్‌లు ఆడాడు. 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. బౌలింగ్ కూడా చేసిన రోహిత్ ఒక వికెట్ తీశాడు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు. జట్టు విజయంలో కీలకమైన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న కోహ్లీ మాట్లాడుతూ ‘ఇది నా కెరీర్లో చివరి టీ20 ప్రపంచకప్. ఏదైతే సాధించాలనుకున్నామో అది అందుకున్నాం. భారత్ తరఫున టీ20ల్లో ఇదే చివరి మ్యాచ్. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. టీ20లను ముందుకు తీసుకెళ్లేందుకు యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఐసీసీ ట్రోఫీ కోసం ఏండ్లుగా ఎదురుచూశాం. రోహిత్‌కు ఇది తొమ్మిదో టీ20 ప్రపంచకప్ అయితే..నాకిది ఆరోది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాం. ఇది చిరకాలం మా మదిలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని అన్నాడు. 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కోహ్లీ.. 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లినే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం విశేషం.
#WATCH | On his retirement from T20 International Cricket, Indian skipper Rohit Sharma says, ” Whenever I feel inside what is right, I try and do that, that has been my nature when I captained the team as well. What I feel inside is what I want to do. I don’t think a lot about… pic.twitter.com/U2VsQRCrC7
— ANI (@ANI) June 30, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

