దుబాయ్: ఆసియాకప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycroft) విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను తక్షణమే ఆసియాకప్ నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. ఇండియాతో మ్యాచ్ జరిగిన సమయంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహార శైలి సరిగా లేదని, ఆయన ఏసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు పీసీబీ ఆరోపించింది.
69 ఏళ్ల పైక్రాఫ్ట్.. జింబాబ్వే మాజీ క్రికెటర్. ఆదివారం జరిగిన ఇండో, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. దీంతో ఈ అంశంపై వివాదం ముదురుతోంది. ఆసియా కప్ నిర్వహణ.. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ పరిధిలోనే జరుగుతున్నా.. తమ ఫిర్యాదును ఐసీసీకి అందజేసినట్లు పీసీబీ పేర్కొన్నది. తక్షణమే పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలని పీసీబీ చీఫ్ మోసిన నఖ్వీ తెలిపారు.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అధిపతిగా ప్రస్తుతం నఖ్వీ కొనసాగుతున్నారు. టీమిండియా క్రికెటర్లు వ్యవహరించిన తీరు క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ఆరోపించింది. పాక్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ టాస్ సమయంలో కానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. భారత ఆటగాళ్ల వైఖరిని ఖండిస్తూ పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా నిరసన వ్యక్తం చేశారు.