Ben Stokes | వాటితో క్రికెటర్లకు పిచ్చి లేస్తోంది..! బెన్ స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ సారథి కామెంట్స్
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్. మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం వల్ల తాను అలిసిపోయానని.. వన్డేలకు న్యాయం చేయలేకపోతున్నానని అతడు సోమవారం 50 ఓవర్ల ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హుస్సేన్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా నిరాశపరిచే వార్త. ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంది..? దానివల్ల ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారనేది స్టోక్స్ నిర్ణయంలో స్పష్టంగా కనిపించింది. అవును.. ఇంత తీరిక లేని షెడ్యూల్ ఉంటే ఆటగాళ్లకు పిచ్చెక్కకుండా ఏం జరుగుతుంది..? ఐసీసీ ఈవెంట్లు, ద్వైపాక్షిక సిరీస్ లు.. మధ్యలో సందు దొరికితే ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల ఆటగాళ్లు శారీరకంగానే గాక మానసికంగా కూడా అలిసిపోతున్నారు. ఇంత తీరిక లేని షెడ్యూల్ లో వాళ్లు ఆటకు గుడ్ బై చెప్పకుంటే ఇంకేం చెబుతారు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్టోక్స్ నిర్ణయం తర్వాత అయినా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), ఐసీసీ లు తమ షెడ్యూల్ లు, ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP) పై మరోసారి ఆలోచించాలని హుస్సేన్ సూచించాడు.
‘31 ఏండ్లకే స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ షెడ్యూల్స్ పై దృష్టి సారించండి. అలాగే వన్డేలపై కూడా. అందరూ టెస్టు క్రికెట్, టీ20 లనే ఇష్టపడుతున్నారు. మరి 50 ఓవర్ల ఫార్మాట్ సంగతేంటి..?’ అని ప్రశ్నించాడు. స్టోక్స్ మంగళవారం తన హోంగ్రౌండ్ (డర్హమ్) లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో ఆడి వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

