లండన్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే గత ఆదివారం రెండో టెస్టు అయిదో రోజు ఆటలో వివాదాస్పద రనౌట్(Controversial runout) చోటుచేసుకున్నది. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో రనౌట్(Bairstow runout) అయిన విధానం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బెయిర్‌స్టోను ఆసీస్ వికెట్ కీపర్ ఔట్ చేసిన స్టయిల్‌పై వివాదం ముదిరింది. దీంతో ఆసీస్ ఆన్ ఫీల్డ్ ప్రవర్తన సరిగా లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరోపించాడు. ఆ ఆరోపణలకు బ్రిటీష్ ప్రధాని రుషీ సునాక్ కూడా వత్తాసు పలికారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. టెస్టు మ్యాచ్ ముగిసినా.. రెండు దేశాలకు చెందిన మీడియాలు మాత్రం తమ కథనాలతో పంచ్‌లు వేస్తూ రీడర్లను ఆకట్టుకుంటున్నాయి.
Why is there even a debate about the Bairstow “run out”? He was clearly & fairly out!
Carey collected the ball & in the same motion threw it at the stumps. Bairstow was walking down the pitch without so much as informing the wicket keeper! That’s OUT!pic.twitter.com/daQtHSjd7F
— Sameer Gharat (@supersam5) July 2, 2023
ఆస్ట్రేలియాకు చెందిన ద వెస్ట్ ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. బెన్ స్టోక్స్ ఫోటోను ఆ పత్రిక పోస్టు చేసింది. అయితే క్రైబేబీస్ అన్న టైటిల్‌తో ఆ పత్రిక ఫోటోను ప్రచురించింది. న్యాపీ వేసుకున్న స్టోక్స్ ఫోటోను వాడింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోపై బెన్ స్టోక్స్ రియాక్ట్ అయ్యాడు. కచ్చితంగా అది తాను కాదు అని, కొత్త బంతితో బౌలింగ్ చేస్తున్న నాటి నుంచి తానేమీ కాదని ఆసీస్ మీడియాకు కౌంటర్ ఇచ్చాడు.
బెయిర్‌స్టో అవుట్‌పై స్పందించిన స్టోక్స్.. ఆసీస్ తరహాలో తానేమీ మ్యాచ్ గెలవాలనుకోవడం లేదన్నాడు. కానీ మైదానంలో జరిగిన సంఘటన రూల్స్ ప్రకారమే జరిగిందన్నాడు. ఆస్ట్రేలియా మాత్రం కీపర్ క్యారీ చేసిన పనిని మెచ్చుకున్నది. ఇంగ్లండ్ మాజీ దిగ్గజ క్రికెటర్ సర్ జెఫ్రీ బాయ్‌కాట్ దీనిపై స్పందించారు. ఆస్ట్రేలియా ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బెయిర్‌స్టో వివాదంపై బ్రిటన్ ప్రధాని స్పందించిన నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా స్పందించారు. తమ జాతీయ జట్టు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన గర్వాన్ని వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టులను సొంతం చేసుకుని 2-0 ఆధిక్యంలో ఉంది. బజ్‌బాల్ స్ట్రాటజీతో ఆడుతున్న ఇంగ్లండ్‌కు మాత్రం ఈ సిరీస్ కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గురువారం లీడ్స్‌లో మూడవ టెస్టు ప్రారంభంకానున్నది.
That’s definitely not me, since when did I bowl with the new ball https://t.co/24wI5GzohD
— Ben Stokes (@benstokes38) July 3, 2023