South Africa | దక్షిణాఫ్రికా దర్జాగా.. సెమీస్‌లోనే ముగిసిన అఫ్గానిస్థాన్ పోరాటం
ఐసీసీ టోర్నీలలో కప్పు కొట్టాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఏండ్లుగా వేధిస్తున్న ‘సెమీస్ గండాన్ని’ ఆ జట్టు విజయవంతంగా అధిగమించి తమపై ఉన్న ‘చోకర్స్' ముద్రను చెరిపేసుకుంది.
- తొలిసారి ఫైనల్లో సఫారీలు
- 56 పరుగులకే ఆలౌట్
ఐసీసీ టోర్నీలలో కప్పు కొట్టాలన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశలో దక్షిణాఫ్రికా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఏండ్లుగా వేధిస్తున్న ‘సెమీస్ గండాన్ని’ ఆ జట్టు విజయవంతంగా అధిగమించి తమపై ఉన్న ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకుంది. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌కు రీఎంట్రీ ఇచ్చాక ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ (వన్డే, టీ20)లలో తొలిసారి ఆ (పురుషుల) జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. బౌలర్లు చెలరేగడంతో సెమీస్‌లో సఫారీలు అఫ్గానిస్థాన్‌పై ఏకపక్ష విజయం సాధించారు. ఇక ఈ మెగా ఈవెంట్ ఆసాంతం అనూహ్య విజయాలు, అబ్బురపరిచే పోరాట పటిమతో మొదటిసారి వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన అఫ్గాన్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. బ్యాటింగ్ వైఫల్యంతో ‘పఠాన్లు’ అవమానకర ఓటమిని మూటగట్టుకున్నారు. జాన్సెన్, షంసీ, రబాడా, నోకియా ధాటికి కాబూలీ బ్యాటర్లు విలవిల్లాడి 56 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
South Africa | తరౌబా (ట్రినిడాడ్): సుదీర్ఘకాలంగా తమకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని దక్కించుకునే క్రమంలో దక్షిణాఫ్రికా మరో కీలక అడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో తొలి సెమీఫైనల్లో సఫారీలు అఫ్గానిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో జాన్సెన్ (3/16), తబ్రేజ్ షంసీ (3/6), కగిసొ రబాడా (2/14), అన్రిచ్ నోకియా (2/7) విజృంభించంతో అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది. అజ్మతుల్లా ఒమర్జయ్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా ఆ జట్టుకు వచ్చిన అదనపు పరుగులే (13) అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ కావడం గమనార్హం. స్వల్ప ఛేదనను దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే నష్టపోయి ఛేదించింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్ (23 నాటౌట్), రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
సఫారీ బౌలర్ల ధాటికి కుదేలు:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ సారథి రషీద్ ఖాన్‌కు తానెంత తప్పు చేశాడో తెలియడానికి పెద్దగా టైం పట్టలేదు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన ఆ జట్టు ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్.. జాన్సెన్ వేసిన తొలి ఓవర్లో ఆఖరి బంతికి స్లిప్స్‌లో రీజా హెండ్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. అప్పుడు మొదలైన వికెట్ల పతనం.. అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసేదాకా నిరాటంకంగా సాగింది.
జాన్సెన్ 3వ ఓవర్లో గుల్బాదిన్ (9)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరుసటి ఓవర్లో రబాడా.. జద్రాన్ (2)తో పాటు నబీ(0)ని పెవిలియన్‌కు పంపి అఫ్గాన్‌ను కోలుకోనీయలేదు. డబుల్ డిజిట్ స్కోరు చేసిన అజ్ముతుల్లాను నోకియా 7వ ఓవర్లో బలిగొనగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ కనీసం పోరాడకుండానే వెనుదిరిగారు. షంసీ వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి అఫ్గాన్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఆడుతూ పాడుతూ..
స్వల్ప ఛేదనను సఫారీలు ఆడుతూ పాడుతూ ఛేదించారు. రెండో ఓవర్లోనే ఓపెనర్ క్వింటన్ డికాక్ (5) వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ హెండ్రిక్స్, మార్క్మ్ కలిసి అఫ్గన్‌కు ఎలాంటి అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. ఈ జోడీ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించింది.
సంక్షిప్త స్కోర్లు:
అఫ్గానిస్థాన్: 11.5 ఓవర్లలో 56 ఆలౌట్ (అజ్మతుల్లా 10, గుల్బాదిన్ 9, షంసీ 3/6, జాన్సెన్ 3/16). దక్షిణాఫ్రికా: 8.5 ఓవర్లలో 60/1 (హెండ్రిక్స్ 29 నాటౌట్, మార్క్మ్ 23 నాటౌట్, ఫరూఖీ 1/11)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

