టీ20 ప్రపంచకప్‌లో మరో సమరానికి తెర లేచింది. వరుస విజయాలతో ఊపు మీదున్న పాకిస్థాన్.. మంచి ఫామ్‌లో ఉన్న ఆప్ఘనిస్థాన్ మధ్య కొద్దిసేపట్లో పోరు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ ముందు ఫీల్డింగ్ చేయనుంది. ఇదివరకు పాక్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో కూడా ఫస్ట్ ఫీల్డింగ్ చేసి తర్వాత ఛేజింగ్ చేయనుంది. అయితే.. ప్రస్తుతం పాకిస్థాన్ ఉన్న ఫామ్‌ను చూస్తుంటే.. ఛేజింగ్ కొట్టిన పిండిలా కనిపిస్తుంది. మరోవైపు ఆఫ్ఘాన్ ప్లేయర్లు కూడా చెలరేగిపోతున్నారు. మరి.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో తేలాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఈ పిచ్ చూస్తుంటే డ్రైగా కనిపిస్తోంది. అందుకే.. తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం అని ఆఫ్ఘాన్ కెప్టెన్ మహమ్మద్ నబి అన్నాడు. ఈ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో జరగనుంది.
ఆఫ్ఘాన్ ప్లేయర్లలో హజ్రతుల్లా జజాయ్, మహమ్మద్ షాహ్జాద్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నజిబుల్లా జద్రాన్, మహమ్మద్ నబి(కెప్టెన్), అస్గర్ అప్ఘాన్, గుల్బదిన్ నైబ్, కరీమ్ జనత్, రషిద్ ఖాన్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ రహ్మాన్ బరిలో ఉండగా… పాక్ టీమ్ నుంచి మహమ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), బాబర్ అజామ్(కెప్టెన్), ఫకర్ జమాన్, మహమ్మద్ హఫీజ్, సోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్, హసన్ అలీ, హరిశ్ రవుఫ్, షాహీన్ షా అఫ్రిదీ బరిలో ఉన్నారు.
Afghanistan have won the toss in Dubai and elected to bat first 🏏 #T20WorldCup | #PAKvAFG | https://t.co/qqdKXO3nAW pic.twitter.com/UPTdC8aHhE
— ICC (@ICC) October 29, 2021