e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News ఇటు నజీబ్‌.. అటు ముజీబ్‌

ఇటు నజీబ్‌.. అటు ముజీబ్‌

  • అల్లాడించిన అఫ్గానిస్థాన్‌
  • 130 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ చిత్తు

షార్జా: బ్యాటింగ్‌లో నజీబ్‌.. బౌలింగ్‌లో ముజీబ్‌ విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ ఘనంగా బోణీ కొట్టింది. నేరుగా సూపర్‌-12కు అర్హత సాధించిన అఫ్గాన్‌ మంగళవారం స్కాట్లాండ్‌ను 130 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (34 బంతు ల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం సాధించగా.. హజ్రతుల్లా (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మానుల్లా (46; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) దంచికొట్టారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో షరీఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్‌ స్పిన్నర్లు ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (5/20), రషీద్‌ ఖాన్‌ (4/9) ధాటికి స్కాట్లాండ్‌ ప్లేయర్లు క్రీజులో నిలువలేకపోయారు.

ఆల్‌రౌండ్‌ జోరు..
పొట్టి ఫార్మాట్‌లో తామెంత ప్రమాదకారులమో కాబూలీలు మరోసారి ప్రపంచానికి చాటారు. తొలుత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు చేసిన అఫ్గాన్‌.. ఆనక స్పిన్‌ ఉచ్చులో బిగించి ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఛేదనలో తొలి మూడు ఓవర్లు మాత్రమే పోటీలో ఉన్న స్కాట్లాండ్‌.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ముజీబ్‌ చేతికి బంతి చేరడంతోనే పరాజయం అంచుల్లో కూరుకుపోయింది. నాలుగో ఓవర్‌ రెండో బంతికి కైల్‌ కొయిట్జర్‌ (10)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన ముజీబ్‌.. మరుసటి బంతికి మెక్‌లియాడ్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక చివరి బంతికి బెర్రింగ్‌టన్‌ (0) కూడా ఔట్‌ కావడంతో ముజీబ్‌ ఖాతాలో మూడో వికెట్‌ చేరింది. 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ను స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చావుదెబ్బ కొట్టాడు. గింగిరాలు తిరిగే బంతులతో వరుసబెట్టి వికెట్లు పడగొట్టడంతో స్కాట్లాండ్‌ 60 పరుగులకే కుప్పకూలింది.

- Advertisement -

సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్థాన్‌: 20 ఓవర్లలో 190/4 (నజీబ్‌ 59, రహ్మనుల్లా 46; షరీఫ్‌ 2/33), స్కాట్లాండ్‌: 10.2 ఓవర్లలో 60 ఆలౌట్‌ (మున్షి 25; ముజీబ్‌ 5/20, రషీద్‌ 4/9).

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement