South Africa vs Afghanistan | షార్జా (యూఏఈ): అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు సంచలన ప్రదర్శనతో అగ్రశ్రేణి దక్షిణాఫ్రికాకు అనూహ్య షాకిచ్చింది. షార్జా (యూఏఈ) వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం ముగిసిన తొలి వన్డేలో కాబూలీలు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. వన్డేల్లో అఫ్గన్పై సఫారీలకు ఇదే అత్యల్ప స్కోరు. వియాన్ మల్డర్ (52) టాప్ స్కోరర్. ఫరూఖీ (4/35), ఘజన్ఫర్ (3/20), రషీద్ ఖాన్ (2/30) దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించారు. అనంతరం అఫ్గానిస్థాన్.. 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫరూఖీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.