ODI World Cup | తొలి 15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆప్ఘనిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 98 పరుగులు చేసింది. 15వ ఓవర్ లో తొమ్మిది పరుగులు లభించాయి. 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్లు రమానుల్లా గుర్బాజ్ 45, ఇబ్రహీం జాద్రాన్ 51 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఇబ్రహీం జద్రాన్ 55 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 51 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ముందు 283 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. పాకిస్థాన్ స్పిన్ బౌలర్లు హరిష్ రవూఫ్, ఉసమా మిర్ ల బౌలింగ్‌ను నిర్ద్యాక్షిణ్యంగా గుర్బాజ్, జద్రాన్ చీల్చి చెండాడుతున్నారు.