ODI World Cup | ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్-2023లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ముంగిట ఆప్ఘనిస్థాన్ 285 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. తొలుత టాస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.
ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 80, ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీద్ మూడు, మార్క్ వుడ్ 2, లియాం లివింగ్ స్టోన్, జాయ్ రూట్, రీసీ టోప్లే చెరో వికెట్ తీశారు.