AFG vs SL: మహారాష్ట్రలోని పూణే వేదికగా శ్రీలంక – అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న 30వ లీగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక తడబడింది. ఆ జట్టులో ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా అర్థ సెంచరీ చేయలేకపోవడంతో లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ పతుమ్ నిస్సంక (60 బంతుల్లో 46, 5 ఫోర్లు) టాప్ స్కోరర్. అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూఖీ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. ఆదినుంచి లంకను కట్టడి చేసిన అఫ్గానిస్తాన్.. ఈ మెగా టోర్నీలో మూడో విజయం సాధిస్తే పాకిస్తాన్, శ్రీలంకను దాటి ఐదో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ దిముత్ కరుణరత్నె (15) విఫలమవగా కెప్టెన్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 39, 3 ఫోర్లు), పతుమ్ నిస్సంక రెండో వికెట్కు 62 పరుగులు జోడించారు. లంకను నిలబెడతారునుకున్న ఈ జోడీని అజ్మతుల్లా విడదీశాడు. నిస్సంక నిష్క్రమించినా కుశాల్.. మిడిలార్డర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ (40 బంతుల్లో 36, 3 ఫోర్లు) లు మూడో వికెట్కు 50 పరుగులు జతచేశారు. కానీ ఐదు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ నిష్క్రమించడంతో లంక కష్టాల్లో పడింది.
మిడిలార్డర్లో చరిత్ అసలంక (28 బంతుల్లో 22, 2 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (14)లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఏంజెలో మాథ్యూస్ (26 బంతుల్లో 23, 1 ఫోర్, 1 సిక్స్) చివరిదాకా ఉన్నా అతడు బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. లంక లోయరార్డర్ బ్యాటర్ దుష్మంత చమీర (1) విఫలమైనా మహీశ్ తీక్షణ (31 బంతుల్లో 29, 3 ఫోర్లు) ఆదుకోవడంతో లంక స్కోరు 200 మార్కు దాటింది.
An interesting run chase awaits in Pune!
Afghanistan require 242 for victory, the winner of today’s game will move to fifth in the table.#CWC23 #BBCCricket pic.twitter.com/OFXnticxQu
— Test Match Special (@bbctms) October 30, 2023
అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ పది ఓవర్లలో 34 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా ముజీబ్ ఉర్ రెహ్మాన్ పది ఓవర్లు వేసి 38 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.