AFG vs SL: సెమీస్ రేసును రసవత్తరంగా మార్చేందుకు నేడు పూణె వేదికగా తలపడుతున్న అఫ్గానిస్తాన్ – శ్రీలంక మధ్య మ్యాచ్‌లో అఫ్గాన్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా అఫ్గానిస్తాన్.. ఏడో స్థానంలో ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లకూ నేటిపోరు కీలకం కానున్న నేపథ్యంలో ఇరు జట్లు విజయంపై కన్నేశాయి. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్-4లో ఉన్న జట్టుకు పోటీనివ్వొచ్చు.
ఇప్పటివరకూ వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్‌లలో గెలిచిన లంక.. అఫ్గాన్‌తో పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చింది. ఆరో ఓవర్లోనే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన దిముత్ కరుణరత్నె (15)ను ఫజల్లా ఫరూఖీ వికెట్ల ముందు బలిగొన్నాడు. ఓపెనర్ పతుమ్ నిస్సంక (42 నాటౌట్), కెప్టెన్ కుశాల్ మెండిస్ (13 నాటౌట్) లు లంకను నిలబెట్టే పనిలో ఉన్నారు. 16 ఓవర్లు ముగిసేసరికి లంక.. ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది.
AfghanAtalan celebrate @rashidkhan_19 100th ODI by awarding him a special shield from @Trotty, a cap from @MohammadNabi007, and a playing shirt with the number 100 from bowling coach @HamidHassanHH. 👍
Wish you all the very best on this special day Rash! 🤩#CWC23 pic.twitter.com/C4nORPEdjt
— Afghanistan Cricket Board (@ACBofficials) October 30, 2023
కాగా వన్డేలలో రషీద్ ఖాన్‌కు ఇది వందో మ్యాచ్ కావడం గమనార్హం. మ్యాచ్ ప్రారంభానికి ముందు అఫ్గానిస్తాన్ అతడిని ప్రత్యేకంగా సత్కరించింది.