AFG vs NZ | అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా ఆతిథ్యమిస్తున్న చారిత్రాత్మక టెస్టులో ఒక్క బంతి కూడా పడకుండానే తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నాలుగు రోజుల నుంచీ నోయిడాలో వర్షం లేకున్నా కనీసం చిన్న చినుకు కూడా పడకున్నా అక్కడ ఆట సాగకపోవడానికి కారణం తడి ఔట్‌ఫీల్డ్. అదీగాక ఇక్కడ వసతులు కూడా సరిగ్గా లేవని, క్రికెటర్లకు వడ్డించే ఆహారపాత్రలను టాయ్లెట్లలో శుభ్రం చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవడం, ఔట్ ఫీల్డ్‌ను ఫ్యాన్లతో ఆరబెట్టడం వంటివి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో అందరూ ఇది బీసీసీఐ నిర్వహణ లోపమని ఎత్తిచూపుతున్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది!
ఆప్షన్లు ఇచ్చినా..
తాలిబన్ రాజ్యం పుణ్యమా అని తమ దేశంలో క్రికెట్ ఆడే పరిస్థితులు లేకపోవడంతో తటస్థ వేదికల మీద ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతున్న అఫ్గాన్.. న్యూజిలాండ్‌తో తాము ఆడబోయే మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐని కోరింది. అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందిస్తూ.. కాన్పూర్, నోయిడా, బెంగళూరు వేదికలలో ఏదైనా ఒకదానిని ఎంచుకోవాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కు సూచించింది. గతంలోనూ నోయిడాలో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండటంతో అఫ్గాన్.. ఈ వేదికనే ఎంచుకున్నట్టు ఏసీబీ అధికార ప్రతినిధి మెహనజుద్దీన్ రజ్ తెలిపాడు.
Richest Board in The World Won’t Even Provide Better facilities 🙏 Yes it’s Afg vs NZ Match but BCCi Shouldn’t be help them in Noida.
Absolutely Shame #Sagar pic.twitter.com/Kezne7y5Hf
— Sagar Mhatre (@MhatreGang) September 10, 2024
ఇదే విషయమై అతడు మాట్లాడుతూ.. ‘బీసీసీఐ మాకు మూడు ఆప్షన్లను ఇచ్చింది. మేం నోయిడాను ఎంచుకున్నాం. ఎందుకంటే ఇది ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. కాబూల్ నుంచి నేరుగా కనెక్టివిటీ ఉండటం, లాజిస్టిక్స్ సమస్య కూడా లేకపోవడంతో మేం దీనినే ఎంచుకున్నాం’ అని ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. నోయిడాతో పోల్చితే కాన్సూర్, బెంగళూరు స్టేడియాలలో అత్యాధునిక వసతులు కలిగి ఉండగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. ఇది తెలిసి కూడా అఫ్గాన్ నోయిడాను ఎంచుకుని ఇప్పుడు బీసీసీఐపై నిందలు వేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా నిర్వాహణ లోపం కారణంగా న్యూజిలాండ్‌తో చారిత్రాత్మక టెస్టు ఆడి సత్తా చాటాలనుకున్న అఫ్గాన్ ఆటగాళ్ల కల కలగానే మిగిలిపోతుండటం ఆ దేశ అభిమానులను కలవరపరుస్తోంది.
Ok so catering here at Greater Noida stadium is using urinal washroom
Water tap for their water needs 😯
very hygienic 👍#AFGvNZ TEST #afgvsnz test #gnoidastadium pic.twitter.com/VCWVA5r2vv— Nitin K Srivastav (@Nitin_sachin) September 10, 2024