అబుధాబి: పసికూన నమీబియాపై ఆఫ్ఘనిస్థాన్ బ్యా్ట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (33), మొహమ్మద్ షెహజాద్ (45) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్ (4), నజిబుల్లా జద్రాన్ (7) నిరాశపరిచినా అష్గర్ ఆఫ్ఘన్ (31), కెప్టెన్ మొహమ్మద్ నబీ (32 నాటౌట్) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్ఘనిస్థాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్, నికోల్ లాఫ్టీ ఈటన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జేజే స్మిత్ ఒక వికెట్ తీశాడు.