అబుధాబి: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో నమీబియా బ్యాట్స్‌మెన్ చెమటోడుస్తున్నారు. 161 టార్గెట్‌తో బరిలోకి దిగిన వారికి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఓపెనర్ క్రెయిగ్ విలియమ్స్ (1) అవుటయ్యాడు. ఆ తర్వాత ఒక సిక్స్ కొట్టి ఊపుమీదున్న మైకేల్ వాన్ లింగెన్ (11) కూడా పెవిలియన్ చేరాడు.
ఆరో ఓవర్లో గుల్బాదిన్ నైబ్ బంతికి లాఫ్టీ ఈటన్ (14) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంతి అందుకున్న ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తొలి బంతికే జేన్గ్రీన్ (1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో నమీబియా జట్టు 36/4తో కష్టాల్లో మునిగింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 తీయగా గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.