న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ వికెట్ల పతనం కొనసాగుతున్నది. 37వ ఓవర్లో ఆరో వికెట్ కోల్పోయింది. రూట్ బౌలింగ్‌లో మహ్మద్ నబీ (9) రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి అఫ్ఘానిస్థాన్ స్కోర్ 36.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు. తొలి 13 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటిన అఫ్ఘానిస్థాన్.. 37వ ఓవర్‌కు వచ్చినా 200 పరుగుల మార్క్‌ను చేరలేకపోయింది.
ఆదిలోనే వీరవిహారం చేసి స్కోర్ బోర్డును పరుగులు తీయించిన అఫ్ఘాన్ రహమానుల్లా తన 80 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పటి నుంచి స్కోర్ బోర్డు పరుగు మందగించింది. మరోవైపు వికెట్ల పతనం మాత్రం కొనసాగుతూ వచ్చింది.