న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. దాంతో తొలి 15 ఓవర్లలో జట్టు స్కోర్ 100 పరుగుల మార్కును దాటింది. కానీ ఆ తర్వాత ఇబ్రహీం జడ్రాన్ ఔటైన దగ్గరి నుంచి వికెట్ల పతనం కొనసాగింది. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడిపోయాయి.
ఇంగ్లండ్ బౌలర్ లివింగ్ స్టోన్ బౌలింగ్‌లో అజ్మతుల్లా.. వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి అఫ్ఘాన్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు. అంతకుముందు ఇబ్రహీం జడ్రాన్, రహమత్ షా, రహమానుల్లా గుర్బాజ్ వరుసగా ఔటయ్యారు.