న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్-అఫ్ఘానిస్థాన్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుని, అఫ్ఘానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్ఘాన్ ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దాంతో తొలి 9 ఓవర్లలో అఫ్ఘానిస్థాన్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా 75 పరుగులు చేసింది.
రహమానుల్లా గుర్బాజ్ 30 బంతులను ఎదుర్కొని 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జడ్రాన్ 27 బంతుల్లో 20 పరుగులు చేశాడు. అఫ్ఘానిస్థాన్ ఊపు చూస్తుంటే ఇవాళ ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేటట్టే కనబడుతోంది.