షుల్(జర్మనీ) : ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన పురుషుల 50మీటర్ల రైఫిల్త్రీ పొజిషన్ ఫైనల్లో యువ షూటర్ అద్రియన్ కర్మాకర్ కాంస్య పతకంతో మెరిశాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో కర్మాకర్ 446.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. రోమెన్ ఔఫ్రీ, జెన్స్ ఒస్టీ వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. తన ఈ అరంగేట్రం టోర్నీలో ఇప్పటికే 50మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కర్మాకర్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.