ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 192 పరుగుల ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్ వేసిన నాలుగో ఓవర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(8) ఔటవగా, శార్దుల్ ఠాకూర్ వేసిన తర్వాతి ఓవర్లో దూకుడుగా ఆడుతున్న దేవదత్ పడిక్కల్(34) పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే ముగిసేసరికి బెంగళూరు 65/2తో కష్టాల్లో పడింది. జడేజా వేసిన ఏడో ఓవర్లో వాషింగ్టన్ సుందర్(7) వెనుదిరిగాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడాల్సిందే. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్(0), గ్లెన్ మాక్స్వెల్(13) క్రీజులో ఉన్నారు.