ACA : భారత మహిళల క్రికెట్‌కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్ (Mithali Raj)కు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్‌గా చెరగని ముద్రవేసిన ఈ వెటరన్ ప్లేయర్ పేరును స్టాండ్‌కు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) నిర్ణయించింది. విశాఖపట్టణం స్టేడియంలో అక్టోబర్ 12 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలోనే మిథాలీ స్టాండ్ ప్రారంభించాలని ఏసీఏ తీర్మానించింది. ఆమెతో పాటు దిగ్గజ క్రికెటర్ రవి కల్పన (Ravi Kalpana) పేరుతో కూడా ఒక స్టాండ్‌ను ఓపెన్ చేయనున్నట్టు ఏసీఏ తెలిపింది.
‘భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన మిథాలీ రాజ్, రవి కల్పనలకు ఏసీఏ ప్రత్యేక గౌరవం కల్పిస్తోంది. తమ ఆటతో భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచిన ఈ ఇద్దరి పేర్లతో స్టాండ్లను ప్రారంభించాలనుకుంటున్నాం’ అని ఏసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
𝐅𝐢𝐫𝐬𝐭-𝐨𝐟-𝐚-𝐤𝐢𝐧𝐝 𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐞 𝐭𝐨 𝐰𝐨𝐦𝐞𝐧 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐞𝐫𝐬 𝐚𝐭 𝐕𝐢𝐳𝐚𝐠 𝐒𝐭𝐚𝐝𝐢𝐮𝐦! 🙌
Stands named after Mithali Raj & Ravi Kalpana to be unveiled ahead of India-Australia World Cup clash.🏏 #CricketTwitter pic.twitter.com/G1vXU9yNwe
— Female Cricket (@imfemalecricket) October 6, 2025
మహిళల క్రికెట్లో మిథాలీ ఒక లెజెండ్. బ్యాటర్‌గా, సారథిగా టీమిండియాపై చెరగని ముద్ర వేసింది తను. చెక్కుచెదరని ముద్ర వేసింది తను. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మిథాలి.. 6 వేల పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. రన్ మెషీన్‌గా పలు రికార్డులు బద్ధలు కొట్టి 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు 2022 జూన్ 8వ తేదీన వీడ్కోలు పలికింది వెటరన్. కల్పన విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ నుంచి వికెట్ కీపర్‌గా 2015లో తొలి మ్యాచ్ ఆడింది. తను కూడా 2022లోనే రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సందర్భాన్ని ప్రత్యేకంగా మలచాలనుకున్న ఏసీఏ ఈ ఇద్దరి పేర్లను వైజాగ్ స్టేడియం పెవిలియన్‌కు పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకుంది.