Abhishek Sharma : టీ20లు అంటేనే చిచ్చరపిడుగుల హవా. ఈ ఫార్మాట్లో దంచికొట్టే ఆటగాళ్లు చాలామందే ఉన్నా తానే టాప్ అని చాటుకుంటున్నాడు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Shrama ). ఐపీఎల్ నుంచి ఈ ఏడాది అంతర్జాతీయ మ్యాచ్లులోనూ అదరగొడుతున్న అభి పొట్టి క్రికెట్‌ను ఏలుతున్నాడు. ప్రత్యర్ధి ఎవరైనా సరే దంచుడే పరమావధిగా ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ నంబర్ 1 ర్యాంక్‌లో తిష్ట వేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అభిషేక్ తన కలల టోర్నీ కోసం ఎదురుచూస్తున్నాని అంటున్నాడు. ఇంతకు అతడి డ్రీమ్ టోర్నీ ఏంటో తెలుసా..?
పొట్టి క్రికెట్లో భీకర ఫామ్‌తో బౌలర్లకు దడ పుట్టిస్తున్న అభిషేక్ శర్మ ఓపెనర్‌గా స్థిరపడిపోయాడు. మెరుపు బ్యాటింగ్‌తో శుభారంభాలు ఇస్తూ టీమిండియాకు ప్రధాన అస్త్రంగా మారిన అతడు వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ కోసం తాను సిద్దమవుతున్నట్టు చెప్పాడీ సూపర్ స్ట్రయికర్.
Abhishek Sharma eagerly awaits his ‘dream-come-true’ moment — representing India at the T20 World Cup! 🇮🇳🏏 #T20WorldCup #TeamIndia pic.twitter.com/JAIHHvMmLp
— SportsTiger (@The_SportsTiger) November 8, 2025
‘వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నా కెరీర్లోనే అతిపెద్ద టోర్నీ కానుంది. చెప్పాలంటే అది నా కలల టోర్నమెంట్. నేను వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నాకు ఈ మెగా ఈవెంట్లో ఆడే అవకాశం వస్తే రఫ్ఫాడిస్తా’ అని తన మనసులోని మాట చెప్పేశాడీ డాషింగ్ ఓపెనర్. ఆసియా కప్‌లో 314 రన్స్‌తో చెలరేగిన అభిషేక్.. ఆసీస్ గడ్డపై విధ్వంసక ఆటతో రెచ్చిపోయాడు. అభిషేక్ 28 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు.
𝘼𝙗𝙝𝙞𝙨𝙝𝙚𝙠 𝘼𝙨𝙘𝙚𝙣𝙙𝙨 🔝
1️⃣0️⃣0️⃣0️⃣ T20I runs and counting for the swashbuckling Abhishek Sharma. 👏
He also becomes the second-fastest #TeamIndia batter to achieve this feat 🔥#AUSvIND | @IamAbhiSharma4 pic.twitter.com/60OCsf5rJA
— BCCI (@BCCI) November 8, 2025
టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయికి చేరిన భారత క్రికెటర్‌గా అవతరించాడీ లెఫ్ట్ హ్యాండర్. కంగారూలతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో 163 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడీ డేరింగ్ బ్యాటర్. 200ల స్ట్రయిక్ రేటుతో ఆడుతున్న అభి.. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వరల్డ్ కప్ ఆడడం పక్కా అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం 925 రేటింగ్ పాయింట్స్‌తో అభిషేక్ టీ20ల్లో నంబర్ 1 ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్ (T20 World Cup 2026) పోటీలకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. పొట్టి ప్రపంచ కప్ బెర్తులు ఖరారు కావడంతో షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది ఐసీసీ. మొదటగా వేదికల్ని ఖరారు చేయాలి కాబట్టి.. ఆతిథ్య దేశాలైన భారత్‌లో ఐదు, లంకలోని రెండు నగరాలను ఎంపిక చేసింది ఐసీసీ. అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబై.. శ్రీలంకలో కొలంబో, క్యాండీ సిటీల్లో ప్రపంచ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. సెమీఫైనల్స్ కోసం ఒకటి కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాలను ఆడించాలని షార్ట్ లిస్ట్ చేశామని ఐసీసీ తెలిపింది. అయితే.. ముంబైలోని వాంఖడే స్టేడియం పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.
🚨 T20 World Cup Update
The 2026 Men’s T20 World Cup is likely to take place from February 7 to March 8.#CricketTwitter #T20WorldCup pic.twitter.com/pPIZf9bQtR
— CRICKETNMORE (@cricketnmore) November 9, 2025