Abhishek Sharma : పొట్టి క్రికెట్లో సంచలన ఆటకు కేరాఫ్‌గా మారిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి చెలరేగిపోయాడు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బౌలర్లుకు చుక్కలు చూపిస్తూ వేగవంతమైన అర్ధ శతకం సాధించాడు. సిక్సర్లు, హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ ఫార్మాట్లో అతడికిది ఏడో యాభై కావడం విశేషం.
భారత క్రికెట్‌కు ఆణిముత్యంలా దొరికిన అభిషేక్ శర్మ తన బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. ఆసియా కప్‌లో చితక్కొట్టుడు కొట్టిన ఈ యువకెరటం.. ఈసారి న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. నాగ్‌పూర్‌లో ఆకాశమే హద్దుగా ఆడుతున్న అభిషేక్.. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 8వ ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. వరుసగా తొలి మూడు బంతుల్ని బౌండరీ లైన్ దాటించి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
A fiery FIFTY 🔥
7⃣th in T20Is for Abhishek Sharma 👏
He is looking in great touch tonight 👌
Updates ▶️ https://t.co/ItzV352h5X#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/sKBaApHjtp
— BCCI (@BCCI) January 21, 2026
ఈ ఫార్మాట్లో 25 కంటే తక్కువ బంతుల్లోనే అతడు మెరుపు హాఫ్ సెంచరీ బాదేయడం ఇది ఎనిమిదోసారి. ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్), భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లెవిస్(వెస్టిండీస్)లు ఏడేసి పర్యాయాలు25 బంతులు లేదా అంతకంటే లోపే ఫిఫ్టీ కొట్టేశారు.
Dealing in MAXIMUMS 💥
Abhishek Sharma 🤝 Surya Kumar Yadav
Updates ▶️ https://t.co/ItzV352h5X#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/GUndgBVKgQ
— BCCI (@BCCI) January 21, 2026