Abhishek Sharma : టీ20ల్లో వీరబాదుడుకు కేరాఫ్ అయిన అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా పర్యటనలో దంచికొడుతున్న అభిషేక్ పొట్టి క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ రికార్డు సృష్టించాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1,000 రన్స్ పూర్తి చేసుకోగా.. అభిషేక్ 28 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరుకున్నాడు.
పొట్టి క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న అభిషేక్ శర్మ పరుగుల ప్రవాహం కొనసాగుతోంది. ఐపీఎల్ విధ్వంసాన్ని అంతర్జాతీయ మ్యాచుల్లోనూ చూపిస్తున్న అభి.. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు సాధించాడు. కోమ్లీ టాప్‌లో ఉండగా.. కేల్ రాహుల్ (29 ఇన్నింగ్స్‌లు), సూర్యకుమార్ యాదవ్(31 ఇన్నింగ్స్‌లు), రోహిత్ శర్మ(40 ఇన్నింగ్స్‌లు)లు టాప్-5లో ఉన్నారు. బంతుల పరంగా చూస్తే అభిషేక్‌దే అగ్రస్థానం.
1000 T20I runs for Abhishek Sharma in just his 28th innings ✨https://t.co/i2lJabkG0C 📊 pic.twitter.com/ayupl9ev26
— ESPNcricinfo (@ESPNcricinfo) November 8, 2025
ఈ డాషింగ్ బ్యాటర్ 528 బంతుల్లో వెయ్యి పరుగులు అందుకున్నాడు. సూర్యకుమార్ 573 బంతుల్లో, ఇంగ్లండ్ చిచ్చరపిడుగు ఫిల్ సాల్ట్ 599 బంతుల్లో ఈ ఫీట్ సాధించారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 604 బంతుల్లో, ఆండ్రూ రస్సెల్(వెస్టిండీస్), ఫిన్ అలెన్(న్యూజిలాండ్)లు 609 బంతుల్లో వెయ్యి క్లబ్లో చేరారు.