Abhishek Sharma : ఆసియా కప్‌లో భారత క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కొనసాగించిన విధ్వంసం మామూలుది కాదు. పవర్ ప్లేలో మెరుపు బ్యాటింగ్‌తో భారత జట్టు విజయాల్లో కీలకమయ్యాడీ ఓపెనర్. ఫైనల్లో విఫలమైనా.. మూడు హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడీ యంగ్‌స్టర్. ఈ మెగా టోర్నీలో అభిషేక్ ఆటకు అభిమానులు ఫిదా అయిపోగా.. అతడి కుటుంబ సభ్యులు పట్టలేనంత సంతోషంలో ఉన్నారు. అభిషేక్ సోదరి కోమల్ శర్మ (Komal Sharma) అయితే తెగ సంబురపడిపోతోంది. తన పెళ్లికి ముందే ట్రోఫీ కలను సాకారం చేశాడని ఆమె పొంగిపోతోంది.
‘మా సోదరుడు అభిషేక్ ఆసియా కప్ ట్రోఫీ విజేతగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. టోర్నీ ఆసాంతం అతడు చాలా గొప్పగా ఆడాడు. నా పెళ్లికి ముందు ఇలాంటి బహుమతి అందుకోవాలని ఆశించాను. అనుకున్నట్టే అభిషేక్ నా కలను నిజం చేశాడు. టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా విజేతగా నిలుస్తుందని నాకు తెలుసు’ అని కోమల్ వెల్లడించింది.
#WATCH | Amritsar, Punjab | India defeats Pakistan in #AsiaCupFinal | Sister of Indian cricketer Abhishek Sharma, Komal, says, “It is a matter of pride that my brother Abhishek has won the Asia Cup tournament. We have brought the trophy home, and we are all very happy. I really… pic.twitter.com/2sWfmfDn9Q
— ANI (@ANI) September 29, 2025
ఆసియా కప్‌లో అభిషేక్ ప్రదర్శన పట్ల అతడి తల్లి మంజు శర్మ సైతం ఆనందంతో ఉంది. తమకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారని, తమ కుమారుడిని చూస్తే చాలా గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఆసియా కప్‌లో 200 స్ట్రయిక్ రేటుతో విరుచుకుపడిన అభి.. 314 రన్స్‌తో టాప్ స్కోరర్ గా అవతరించాడు. కోమల్‌కు ఇటీవలే లోవిష్ ఒబెరాయ్‌తో నిశ్చితార్ధం జరిగింది.