దుబాయ్: పాకిస్థాన్ బౌలర్ల పరువు తీశాడు అభిషేక్ శర్మ. సోనీ లైవ్ ఛానల్లో వీరేంద్ర సెహ్వాగ్‌తో చాట్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మ(Abhishek Sharma) కొన్ని కామెంట్స్ చేశారు. ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అభిషేక్ శరవేగంగా 74 రన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో హరీశ్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది లాంటి బౌలర్లను అభిషేక్ చితక్కొట్టాడు. ఎటువంటి తడబాటు లేకుండానే ఆ బౌలర్లను కొట్టేశాడు అభిషేక్. అయితే స్పోనీ స్పోర్ట్స్ చాటింగ్‌లో అతను ఆసక్తికరమైన కామెంట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ లాంటి బ్యాటర్ ఎదుర్కొన్న బౌలర్లు ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో లేరని అభిషేక్ అన్నాడు. అందుకే పాక్ బౌలర్లు తన దూకుడును అడ్డుకోలేకపోయినట్లు చెప్పాడు. పాకిస్థాన్ జట్టులో గతంలో ఉన్నట్లు ఉత్తమ బౌలర్లు లేరని, వీరేంద్ర సెహ్వాగ్ ఎదుర్కొన్న లాంటి బౌలర్లు ఇప్పుడు లేరని అభిషేక్ పేర్కొన్నాడు. వీరూ కొట్టినటువంటి బౌలర్లు ఇప్పుడు తనకేమీ కనిపించడం లేదన్నాడు.
ఆ ఛాటింగ్ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ఓ సూచన చేశాడు. 50, 70 రన్స్ చేసిన సమయంలో.. ఆ స్కోర్లను సెంచరీలుగా మార్చుకోవాలని అభిషేక్‌కు సలహా ఇచ్చాడు. భవిష్యత్తులో ఏదో సందర్భంలో సెంచరీ చేయలేకపోయామే అన్న బాధ కలుగుతుందని సెహ్వాగ్ అన్నాడు. 70 స్కోర్ చేసినప్పుడు, 100 మిస్ కావొద్దు అని సునీల్ గవాస్కర్ చెప్పాడని వీరూ గుర్తు చేశాడు. రిటైర్ అయిన తర్వాత 70, 80 రన్స్ స్కోరు చేసిన ఇన్నింగ్స్ గుర్తు వస్తుంటాయని, ఒకవేళ ఆ ఇన్నింగ్స్‌లను సెంచరీగా మలిస్తే కెరీర్ అద్భుతంగా ఉంటుందని, ఎందుకంటే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు అని సెహ్వాగ్ అన్నాడు. బాగా ఆడుతున్న రోజు, నాటౌట్‌గా ఉండేందుకు ప్రయత్నించాలని, అదే ఉత్తమం అని అభిషేక్‌తో సెమ్వాగ్ చెప్పాడు.