SRH vs RR : నాకౌట్ మ్యాచ్లో సన్రైజర్స్ స్పిన్నర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) బిగ్ వికెట్ తీశాడు. క్రీజులో పాతుకుపోతున్న సంజూ శాంసన్(10)ను వెనక్కి పంపి హైదరాబాద్కు బ్రేకిచ్చాడు. అభిషేక్ ఓవర్లో భారీ షాట్ ఆడిన శాంసన్ బౌండరీ వద్ద మర్క్రమ్ చేతికి దొరికాడు.
అంతే.. 67 రన్స్ వద్ద రాజస్థాన్ మూడో వికెట్ పడింది. ప్రస్తుతం రియన్ పరాగ్(5), ధ్రువ్ జురెల్(3)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. ఈ జోడీని విడదీస్తే మ్యాచ్ సన్రైజర్స్ వైపు తిరిగినట్టే. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 71/3. ఇంకా విజయానికి 103 రన్స్ కావాలి.