 
                                                            ఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు గాను కోల్‌కతా నైట్ రైడర్స్ అభిషేక్ నాయర్‌ను తమ హెడ్‌కోచ్‌గా నియమించుకుంది. మూడు సీజన్ల పాటు కోచ్ బాధ్యతలను నిర్వర్తించిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని నాయర్ భర్తీ చేయనున్నాడు. 2018 నుంచి కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న అతడు..
నిరుడు గౌతం గంభీర్ సారథ్యంలోని భారత జట్టు కోచింగ్ బృందంలో ఒకడిగా నియమితుడైనా చాంపియన్స్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ అతడిపై వేటు వేసిన విషయం విదితమే. డబ్ల్యూపీఎల్‌లోనూ యూపీ వారియర్స్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్న నాయర్.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత శిక్షకుడిగానూ సేవలందిస్తున్నాడు.
 
                            