IPL 2025 : సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ(35) చెలరేగి ఆడుతున్నాడు. విలియం ఓ రూర్కీ బౌలింగ్లో 4, 6 బాది జట్టు స్కోర్ 50 దాటించాడు. అయితే.. ఆ తర్వాత దిగ్వేశ్ రథీ 6 పరుగులే ఇచ్చాడు. కానీ, అవేశ్ ఖాన్ బౌలింగ్లో అభి.. వరుసగా 2 ఫోర్లు బాదాడు. మరో ఎండ్లో ఇషాన్ కిషన్(16) సైతం దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.
భారీ ఛేదనను సన్రైజర్స్ ఓపెనర్లు ధాటిగా ఆరంభించారు. ట్రావిస్ హెడ్ స్థానంలో ఆడుతున్న అథర్వ తైడే(13) అలరించాడు. అయితే.. విలియం ఓరూర్కీ బౌలింగ్లో వరుసగా రెండు ఫొర్లు కొట్టిన తైడే థర్డ్ మ్యాన్లో దిగ్వేశ్ రథీకి చిక్కాడు. 17 వద్ద ఆరెంజ్ ఆర్మీ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్(16) జతగా అభిషేక్(35) స్కోర్ బోర్డును ఉరికిస్తున్నాడు. ఆకాశ్ ఓవర్లో 4, 6తో దంచుడు మొదలెట్టిన అతడు విలియంకు చుక్కలు చూపించాడు.
Chase begins in top gear for #SRH 🔥
But debutant William O’Rourke strikes for #LSG to remove Atharva Taide! 👊
Updates ▶ https://t.co/GNnZh90u7T#TATAIPL | #LSGvSRH | @LucknowIPL | @SunRisers pic.twitter.com/0zVDeWnHDm
— IndianPremierLeague (@IPL) May 19, 2025