Abhinav Bindra | న్యూఢిల్లీ: భారత క్రీడా దిగ్గజం అభినవ్ బింద్రాకు సమున్నత గౌరవం దక్కింది. ఒలింపిక్ మూమెంట్‌కు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) బింద్రాకు ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ ఆర్డర్‌ను ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన పారిస్‌లో జరిగే 142వ ఐవోసీ సెషన్లో జరిగే అవార్డు కార్యక్రమంలో బింద్రాకు అందించనున్నారు. ఒలింపిక్స్‌లో క్రీడల అభివృద్ధికి తాము ఎంచుకున్న ఆటల ద్వారా లేదా సాధించిన ఘనతల ద్వారా ఈ అవార్డుకు ఎంపిక చేయనున్నారు.