Abdul Razzaq: పీసీబీని విమర్శించబోయి అమితాబ్ బచ్చన్ కోడలిని అవమానించిన పాక్ మాజీ క్రికెటర్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Abdul Razzaq: పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై విమర్శలు గుప్పించే క్రమంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ ఓ చెత్త ఉదాహరణతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్‌ను అవమానించాడు.
Abdul Razzaq: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై విమర్శలు గుప్పించే క్రమంలో పాక్ మాజీ ఆల్ రౌండర్ ఓ చెత్త ఉదాహరణతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్‌ను అవమానించాడు. మెగా టోర్నీలో బాబర్ సేన ఘోర ప్రదర్శన, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వ్యవహరిస్తున్న తీరుపై స్పందిస్తూ అతడు ఐశ్వర్యరాయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
రజాక్ మాట్లాడుతూ.. ‘గత కొన్నిరోజులుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉద్దేశంక ఏంటో అర్థం కావడం లేదు. నేను పాక్ తరఫున ఆడే రోజుల్లో నాటి సారథి యూనిస్ ఖాన్ జట్టును అద్భుతంగా నడిపేవాడు. యూనిస్‌తో పాటు జట్టు సహచరుల నుంచి నేను స్ఫూర్తి పొందేవాడిని. కానీ జట్టులో ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు. ఆటగాళ్ల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇదే క్రమంలో పీసీబీని విమర్శించబోయి ‘ఇదెలా ఉందంటే.. మీరు ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకుంటే మీకు మంచి పిల్లలు పుడతారు అనుకుంటారు. కానీ ఎప్పటికీ అలా జరుగదు..’ అని అన్నాడు.
Shameful example given by Abdul Razzaq. #AbdulRazzaq #CWC23 pic.twitter.com/AOboOVHoQU
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) November 13, 2023
రజాక్ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు పక్కనే ఉన్న పాక్ మాజీ ఆటగాళ్లు ఉమర్ గుల్, షహీద్ అఫ్రిదీలు ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్లు భగ్గుమన్నారు. అసందర్భంగా ఈ వివాదంలోకి ఐశ్వర్యరాయ్‌ను లాగడమే కాకుండా ఆమెను అవమానకరరీతిలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజాక్ మంచి ఆల్ రౌండర్ అయినా ఇలా చెప్పడానికి సిగ్గుండాలని దుమ్మెత్తి పోస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

