మిస్టర్ 360 డిగ్రీస్‌గా ప్రపంచ క్రికెట్లో పాపులర్ అయిన ఏకైక ఆటగాడు సౌతాఫ్రికా స్టార్ ఏబీ డివిల్లీర్స్. కొన్నిరోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ ఆటగాడు.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకున్న అనుబంధం గురించి తాజాగా పంచుకున్నాడు.
దీనికి సంబంధించిన పోడ్క్యాస్ట్ను ఆర్సీబీ ట్విట్టర్ హ్యాండిల్లో విడుదల చేసింది. దీనిలో మాట్లాడిన డివిల్లీర్స్.. బెంగళూరు నగరంలో ఏదో ఉందని, అది తనను ఇట్టే పట్టేసిందని చెప్పాడు. ఢిల్లీ, ముంబై వంటి వేరే ఏ ఫ్రాంచైజీకి ఆడినా, తనకు అంతగా అనుబంధం ఏర్పడేది కాదేమో అన్నాడు.
బెంగళూరు గాలే తనకు ప్రత్యేకంగా అనిపించిందన్నాడు. అలాగే కొందరు అభిమానులు తాను ఉండటానికి అపార్ట్మెంట్లు ఇస్తామన్న సంగతిని గుర్తుచేసుకున్న ఏబీడీ.. ‘నాకు ముగ్గురు పిల్లలు. వారికి చాలా ఖాళీ ప్లేస్ కావాలి. కాబట్టి అపార్ట్మెంట్లు పెద్దవైతే బాగుంటుంది’ అంటూ సరదా కామెంట్లు చేశాడు.
సౌతాఫ్రికా క్రికెట్‌తోపాటు ఆర్సీబీకి కూడా ఏదో ఒక విధంగా సహాయపడ గల సత్తా తనకుందన్నాడు. త్వరలోనే మెంటార్ పోస్టులో వచ్చే అవకాశం ఉందంటూ హింట్ ఇచ్చాడు. మరి ఇదెంత తొందరగా నిజమవుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
The RCB Podcast powered by Kotak Mahindra Bank: Trailer
— Royal Challengers Bangalore (@RCBTweets) February 1, 2022
10 episodes, plenty of interesting and never heard before stories about the tournament that made them the superstars they are!
(1/n)#PlayBold #WeAreChallengers #TheRCBPodcast pic.twitter.com/MWPQG3IEwH