USA vs CAN : పొట్టి ప్రపంచ కప్ 9వ సీజన్లో ఆరంభ పోరు అదిరింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా (USA) తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన మూడో జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత పొరుగు దేశపు కెనడా(Canada) జట్టు 190 రన్స్ కొట్టగా.. ఆతర్వాత అమెరికా బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టు రెచ్చిపోయారు. హిట్టర్ అరోన్ జోన్స్(94 నాటౌట్) అయితే ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, అమెరికా జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది.
డల్లాస్‌లోని గ్రాండ్ ప్రియరీ స్టేడియంలో శనివారం బౌండరీల వర్షం కురిసింది. కెనడా, అమెరికా బ్యాటర్లు ఆకాశహే హద్దుగా చెలరేగి అభిమానులకు టీ20 మజాను పంచారు. మొదట ఆడిన కెనడా 20 ఓవర్లో 194 రన్స్ కొట్టింది. నవ్‌నీత్ దలివల్(61), నికోలస్ కిర్టన్(51)లు అర్ధ సెంచరీలతో మెరిసి జట్టుకు భారీ స్కోర్ అందించారు.
Canada set a target of 195 for #TeamUSA! 🎯
Can our batters chase down this total? 🏏
Follow live 📺: Willow TV#T20WorldCup | #USAvCAN 🇺🇸 pic.twitter.com/ehXnUeS1zZ
— USA Cricket (@usacricket) June 2, 2024
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన అమెరికా ఖాతా తెరవకముందే ఓపెనర్ స్టీవెన్ టేలర్(0) డకౌటయ్యాడు. అయినా సరే ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడలేదు. కెప్టెన్ మొనాక్ పటేల్(16) సైతం స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగినా.. ఆండ్రీస్ గౌస్(65) అండగా అరోన్ జోన్స్(94 నాటౌట్) కెనడా బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించాడు. దాంతో, 196 పరుగుల భారీ లక్ష్యాన్ని యూఎస్ఏ 17.4 ఓవర్లలోనే ఛేదించింది. గౌస్, అరీన్ల విధ్వంసం చూసిన వాళ్లంతా.. పెద్ద జట్లకు అమెరికా షాక్ తప్పదా? అని సందేహంలో పడ్డారు.
2️⃣ back-to-back performances that secured us a win against Canada today! 🔥🙌#T20WorldCup | #USAvCAN 🇺🇸 pic.twitter.com/e6VGBYjLy2
— USA Cricket (@usacricket) June 2, 2024