Mumbai Serial Blast Convict Dies | ముంబై వరుస పేలుళ్ల దోషిని.. జైలులో హత్య చేసిన ఖైదీలు
Mumbai Serial Blast Convict Dies | ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. ఐరన్ పైప్‌తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్‌లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది.
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసు దోషిని ఖైదీలు జైలులో హత్య చేశారు. (Mumbai Serial Blast Convict Dies) ఐరన్ పైప్‌తో అతడి తలపై కొట్టి చంపారు. కొల్హాపూర్‌లోని కలాంబా సెంట్రల్ జైలులో ఈ సంఘటన జరిగింది. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో దోషి అయిన 59 ఏళ్ల మున్నా అలియాస్ మహ్మద్ అలీ ఖాన్ అలియాస్ మనోజ్ కుమార్ భవర్లాల్ గుప్తా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
కాగా, ఆదివారం జైలులోని బాత్రూమ్ ప్రాంతంలో స్నానం చేయడంపై మహ్మద్ అలీ ఖాన్, ఇతర ఖైదీల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొంత మంది ఖైదీలు డ్రైనేజీకి చెందిన ఇనుప పైప్‌తో అతడి తలపై కొట్టారని జైలు అధికారులు తెలిపారు. తల పగిలి తీవ్రంగా గాయపడిన ఖాన్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారన్నారు.
మరోవైపు జైలులో దాడి చేసి మహ్మద్ అలీ ఖాన్‌ను హత్య చేసిన నిందితులను ప్రతీక్ అలియాస్ పిల్యా సురేష్ పాటిల్, దీపక్ నేతాజీ ఖోట్, సందీప్ శంకర్ చవాన్, రీతురాజ్ వినాయక్ ఇనామ్దార్, సౌరభ్ వికాస్‌లుగా గుర్తించినట్లు కొల్హాపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఐదుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

