బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మొదటి ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ సంబురాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. 11 మంది చనిపోయిన ఈ ఘటనకు గాను నైతిక బాధ్యత వహిస్తూ తమ రాజీనామాను అధ్యక్షుడు రఘురామ్ భట్‌కు పంపించారు.
ఈ మేరకు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో.. ‘గత రెండు రోజులుగా ఊహించని, దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో మా పాత్ర పరిమితమే అయినా దానికి మేం నైతిక బాధ్యత వహిస్తూ మా పదవుల నుంచి తప్పుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
కాగా తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మృతుల కుటుం బా లకు ఇచ్చే పరిహారాన్ని కర్నాటక ప్రభుత్వం రూ. 10 లక్షలనుంచి రూ. 25 లక్షలకు పెంచిం ది. ఇదిలాఉండగా చిన్నస్వామి ఘటనలో బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద్‌ను బదిలీ చేయడం సమంజసం కాదని ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ అన్నారు.
ఆమె స్పందిస్తూ.. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రత్యేకమైనవి. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ఒకరు కావాలి. అధికారులు పోలీసుల వాద న కూడా వినాలి. ఈ ఘటనలో కమిషనర్ ఏమై నా అందరి అభిప్రాయాలను పెడచెవిన పెట్టారా ? పోలీసు యంత్రాంగం మొత్తం నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క కమిషనర్‌ను మాత్రమే ఎందు కు బాధ్యుడ్ని చేస్తారు?’ అని ప్రశ్నించారు.