హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో క్రీడాభివృద్ధి, వివిధ కార్యకలాపాలపై సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఎల్బీ స్టేడియం సాట్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో పాటు అధికారులు హాజరయ్యారు.
స్టేడియాల నిర్వహణ, జిల్లా యువజన అభివృద్ధి, క్రీడా సంక్షేమం, జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, స్పోర్ట్స్ అకాడమీల పనితీరుపై సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మార్గదర్శకత్వంలో క్రీడా రంగ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు, ప్లేయర్లకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.